నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస'

  • ఏప్రిల్ 3న విడుదలైన 'రాకాస'
  • థియేటర్స్ నుంచి వచ్చిన హిట్ టాక్ 
  • నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు
  • త్వరలోనే అందుబాటులోకి రానుందని టాక్  

నిహారిక కొణిదెల ఒక వైపున వెబ్ సిరీస్ లను .. మరో వైపున చిన్న సినిమాలను నిర్మిస్తూ వెళుతోంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె నిర్మిస్తున్న సిరీస్ లు .. సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి నిహారిక ఉమేశ్ కుమార్ బన్సాల్ తో కలిసి నిర్మించిన సినిమానే 'రాకాస'. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ప్రమోషన్స్ జోరు కారణంగా మంచి బజ్ తెచ్చుకుంది.

సంగీత్ శోభన్ - నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. కంటెంట్ కనెక్ట్ కావడంతో, ఈ సినిమా గట్టిగానే వసూలు చేసింది. నిహారిక కొణిదెలకి ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ నెల చివరివారంలోగానీ .. మే మొదటివారంలోగాని ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. 

కథానాయకుడైన వీరూ, తాను ప్రేమించిన అమ్మాయి కోసం విదేశాల నుంచి వస్తాడు. ఆమెకి మరొకరితో పెళ్లి జరగనుందని తెలిసి బిత్తరపోతాడు. ఆ పెళ్లిని ఆపేయడం కోసం చేసే ప్రయత్నంలో సుబ్బలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఆ ఊరు ఆచారం ప్రకారం వీరూ రాక్షస గుహలోకి అతనికి ఆహారంగా వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? అతనిని కాపాడటం కోసం సుబ్బలక్ష్మి ఏం చేస్తుంది? అనేది కథ.


Niharika Konidela
Rakasa Movie
Rakasa Netflix
Sangeeth Shobhan
Nayan Sarika
Telugu horror comedy thriller
OTT release
Telugu cinema
Netflix India
Rakshasa Gufa

More Telugu News